Gomati Chakras

10.00

It is believed that People Who Possess Gomati Chakra Tree will be BLESSED with MONEY, GOOD HEALTH and PROSPERITY. It is also believed that these Stones and Crystals to PROTECT CHILDREN.

Gomati Chakras

10.00

Add to cart
Buy Now
Category:

గోమతి చక్రాలు మరియు లాకెట్లు
లక్ష్మి దేవి స్వరూపం ఈ “గోమతి చక్రాలు”

దీనిని లాకెట్ లా మేడలో వేసుకోవటం వలన విద్యార్దులకు, వ్యాపారస్తులకు, గృహిణులకు…. ఇలా అందరికి కూడా వారికి తగ్గా ప్రయోజనాలను వారు పొందుతారు..

గోమతి చక్రాలు అరుదైన మరియు సహజసిద్దంగా లభించే “సముద్రపు శిల”. గోమతి చక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు గల ద్వారకలోని గోమతినది నందు లభిస్తాయి.చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులారాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా కాల్షియం లేదా కర్భానపు అణువుల సహాయంతో ఇవి రూపు దిద్దుకుంటాయి. ఈ రెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావటం మరియు ఈ శుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మి దేవికి సోదరుడు కావటం వలన ఈ చక్రాల ఉపయోగం అనేకం అనంతం అని చెప్పవొచ్చు.
జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్ద్యానికి, ప్రేమ, దాంపత్య సౌఖ్యం, సౌభాగ్యాలకు కారకత్వం వహిస్తూ ఉండటం వలన గోమతి చక్రాన్ని ధరించిన వారికి పైవన్నీ పుష్కలంగా లభిస్తాయి.
గోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. దీనినే ‘నాగ చక్రం’ అని ‘విష్ణు చక్రం’ అని కూడా అంటారు. ఇది నత్త గుళ్ళని పోలి ఉంటుంది. అందువల్ల దీనిని ‘నత్త గుళ్ళ’ స్టోన్ అని కూడా అంటారు. గోమతి చక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం ప్లాట్ గాను ఉంటుంది. ఇవి అన్ని రకాల పూజా కార్యక్రమాలకి, సకల కార్యసిద్ధికి,ఆరోగ్య సమస్యలకి, ధరించటానికి ఉపయోగపడతాయి.
ఉపయోగించే విధానం
Ø ఒక్క గోమతి చక్రాన్ని త్రాగే నీళ్ళలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. గోమతి చక్రాన్ని లాకెట్ లాగ దిరిస్తే నర దృష్టి భాదల నుండి విముక్తి కలుగుతుంది. బాలారిష్టదోషాలు కూడా పోతాయి.
Ø రెండు గోమతి చక్రాలను బీరువాలో గాని పర్సు లో గాని ఉంచితే ధనాభివృధ్ధి ఉండి ఎప్పుడు ధనానికి లోటు ఉండదు. రెండు గోమతిచక్రాలను భార్యా భర్తలు నిద్రంచే పరుపు కింద గాని దిండు కింద గాని ఉంచినట్టయితే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు. రెండు గోమతి చక్రాలను ఒక తెల్లని గుడ్డలో వేసి దానిని మీ గుమ్మానికి కట్టండి, నరగోష పటా పంచలైపోతుంది.
Ø మూడు గోమతిచక్రాలను బ్రాస్ లెట్ లాగా చేసుకొని చేతికి ధరిస్తే జనాకర్షణ, కమ్యూనికేషన్, సహాకారం లభిస్తుంది. మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వని వారి పేరు గోమతిచక్రాల మీద రాసి నీటిలో వేయటం గాని, వాటిని వెంట పెట్టుకొని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళితే అతను తీసుకున్న డబ్బులను త్వరగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగాన్ని మంగళవారం రోజు చేస్తే ప్రయోజనం కలుగుతుంది.
Ø నాలుగు గోమతిచక్రాలు పంట భూమిలో పొడిచేసి గాని మాములుగా గాని చల్లటం వలన పంట బాగా పండుతుంది. గృహా నిర్మాణ సమయంలో గర్భ స్ధానం లో నాలుగు గోమతిచక్రాలు భూమిలో స్ధాపించటం వలన ఆ ఇళ్ళు త్వరితగతిన పూర్తి చేసుకొని అందులో నివసించే వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉందురు. నాలుగు గోమతిచక్రాలను వాహానానికి కట్టటం వలన వాహాన నియంత్రణ కలిగి వాహాన ప్రమాదాల నుంచి నివారించబడతారు.
Ø ఐదు గోమతిచక్రాలు తరుచు గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకు కట్టటం వలన గర్భం నిలుస్తుంది. 5 గోమతిచక్రాలు పిల్లలు చదుకొనే బుక్స్ దగ్గర ఉంచటం వలన చదువులో ఏకాగ్రత కలుగుతుంది.తరుచు ఆలోచనా విధానంలో మార్పులు ఉంటాయి.పుత్రప్రాప్తి కోసం 5 గోమతిచక్రాలను నది లోగాని జలాశయంలో గాని విసర్జితం చేయాలి.
Ø ఆరు గోమతిచక్రాలు అనారోగ్యం కలిగిన వ్యాదిగ్రస్తుడి మంచానికి కట్టటం వలన తొందరగా ఆరోగ్యం కుదుటపడుతుంది. శత్రువులపై విజయం సాధించవచ్చును. కోర్టు గొడవలు ఉండవు. విజయం సాధించవచ్చును.
Ø ఏడు గోమతిచక్రాలు ఇంటిలో ఉండటం వలన వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.ఇతరులతో సామాజిక సంబందాలు బాగుంటాయి.7 గోమతిచక్రాలను నదిలో విసర్జితంచేసిన దంపతుల మధ్య అభిప్రాయభేదాలు మటుమాయం అవుతాయి.
Ø ఎనిమిది గోమతిచక్రాలు అష్టలక్ష్మి స్వరూపంగా పూజిస్తారు. తొమ్మిది గోమతిచక్రాలు ఇంటిలో ఉండటం వలన మన ఆలోచనలని ఆచరణలో పెట్టవచ్చు.ఆద్యాత్మిక చింతన కలుగుతాయి.ఆ ఇంటిలోని వ్యక్తులు గౌరవించబడతారు.
Ø పది గోమతిచక్రాలు ఆఫీసులో ఉండటం వలన ఆ సంస్ధకి అమితమైన గుర్తింపు లభిస్తుంది.ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి.మరియు వారు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలతో గుర్తించబడతారు.
Ø పదకొండు గోమతిచక్రాలు లాభ లక్ష్మి స్వరూపంగా పూజిస్తారు.భవన నిర్మాణసమయంలో పునాదిలో పదకొండు గోమతిచక్రాలను ఉంచటం వలన ఎటువంటి వాస్తుదోషాలు ,శల్యదోషాలు ఉండవు.
Ø పదమూడు గోమతిచక్రాలను శివాలయంలో దానం చేసిన ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది.
Ø ఇరవై ఏడు గోమతిచక్రాలని వ్యాపార సముదాయములలో ద్వార బందానికి కట్టి రాకపోకలు ఆద్వారం గుండా చేస్తే వ్యాపారం దినదినాభివృద్ధి అవుతుంది.
జాతకచక్రంలో నాగదోషం,కాలసర్పదోషం ఉన్నవారు పంచమస్ధానంలో ఉన్న రాహువుకి పాపగ్రహాల దృష్టి గాని,సాంగత్యం గాని ఉన్న సంతాన దోషం ఉంటుంది. దీనినే నాగదోషం అంటారు. జాతకచక్రంలో రాహు కేతువుల మద్య అన్నీ గ్రహాలు ఉన్నప్పుడు దానిని కాలసర్పదోషం అంటారు. ఈ రెండు దోషాలు ఉన్నవారు గోమతి చక్రాలను పూజచేయటం గాని, దానం చేయటం గాని, గోమతి చక్రాన్ని మెడలో లాకెట్ లాగా ధరించటం గాని చేయాలి.
గోమతి చక్రాలను “ఓం హ్రీం మహాలక్ష్మీ శ్రీ చిరాలక్ష్మీ ఐం మమగృహే ఆగచ్ఛ స్వాహా” అనే మంత్రంతో గాని లలితా సహస్త్ర నామంతో గాని జపిస్తూ కుంకుమతో లేదా హనుమాన్ సింధూరంతో గాని అర్చన చేయాలి. గోమతి చక్రాల పూజ శుక్రవారం నాడు గాని లేదా దీపావళి రోజు గాని వరలక్ష్మి వ్రతం రోజుగాని చేసుకొని మనకు కావాల్సిన సమయాల్లో వీటిని ఉపయోగించుకోవొచ్చు. పూజ చేసిన గోమతి చక్రాలను పూజా మందిరంలో గాని, బీరువాలో గాని ఉంచి మనకు అవసరమైనప్పుడు వాటిని తీసి ఉపయోగించు కోవొచ్చు. గోమతి చక్రాలను ఎప్పుడు ఎర్రని బట్టలో గాని, హనుమాన్ సిందూరంలో గాని ఉంచాలి. గోమతి చక్రాలను పిరమిడ్ లోపల గాని వెండి బాక్స్ లోపల గాని ఉంచితే కొద్దిగా హనుమాన్ సింధూరం లేదా కుంకుమతో పాటు ఉంచాలి.
అతి తక్కువ ధరకే, ఎనో అద్భుతమైన ప్రయోజనాలు కలిగిన ఈ గోమతి చక్రాలు కావాల్సిన వారు సంప్రదించగలరు.
లాకెట్ ఒక్కొక్కటి 50/- & గోమతి చక్రం ఒక్కొక్కటి 10/- మాత్రమే

Reviews

There are no reviews yet.

Be the first to review “Gomati Chakras”

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!